దిశ యాప్ అవగాహన కార్యక్రమంలో ఒక్కసారిగా కలకలం. దీనికి కారణం స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రె్డ్డి నోట మహిళా ముఖ్యమంత్రి మాట రావటం. దిశ యాప్ గురించి వివరిస్తూ ..ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మహిళ కావటం అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తర్వాత సీఎం జగనే జరిగిన పొరపాటును గుర్తించి రాష్ట్ర హోం మంత్రి మహిళ కావటం అంటూ సర్దిచెప్పారు. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ సోషల్ మీడియా అప్పుడే ట్రోలింగ్ ప్రారంభించింది.