ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సారి కొన్ని టార్గెట్లు పెట్టుకుంది. అందులో ఒకటి వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి చెందిన సొంత నియోజకవర్గం పులివెందుల. నవంబర్ ఒకటిన జరిగిన పోలింగ్ రోజు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓటు వేయటానికి పులివెందుల వచ్చి కూడా ఓటు వేయకుండానే వెనక్కి పోయారు. అధికార కూటమి అరాచకాలు చేస్తోంది అని...వైసీపీ ఏజెంట్స్ ను బూతుల్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు అంటూ కూడా ఆయన కొద్దిసేపు ధర్నా చేశారు కూడా . తమ ఏజెంట్స్ లేకుండా ఎన్నికలు జరిపించటం ఎలా న్యాయం అంటూ ఆయన ప్రభుత్వంపై ...అధికారులపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. పులివెందులలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై కోర్ట్ లో పిటిషన్ వేసిన ఊరట దక్కలేదు. హై కోర్ట్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభించారు.

                                           ఈ ఎన్నికల్లో పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ గా టీడీపీ కి చెందిన గీతా కుమారి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వై ఎస్ ప్రమీలమ్మపై టీడీపీ అభ్యర్థి 13875 ఓట్ల తో విజయం సాధించారు. మొత్తం ఎన్నికలు జరిగిన 20 వార్డు ల్లో కూటమి అభ్యర్థులు 17 చోట్ల విజయం సాధించారు. ఏకగ్రీవాలు కూడా కలుపుకుంటే కూటమి సాధించిన వార్డుల సంఖ్య 37 కి చేరింది. దీంతో వైసీపీ మొత్తం మీద పులివెందుల లో కేవలం మూడు వార్డ్ లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఇష్ఠానుసారం చేయగా...ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏ మాత్రం తేదీ లేకుండా వ్యవహరించింది అనే విమర్శలు ఎదుర్కొంటోంది.

Tags: