ఆంధ్ర ప్రదేశ్ లోని తొలి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో యూజర్ డెవలప్మెంట్ చార్జీలు (యూడీఎఫ్) మరో సారి పెరగనున్నాయి. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంలో యూడీఫ్ చార్జీలు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్ట్ 17 నుంచి ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. 2026 డిసెంబర్ నుంచి 2027 మార్చి 31 వరకు కొత్త చార్జీలను ఫిక్స్ చేస్తూ ఎయిర్ పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ ఆథారిటీ (ఏఈఆర్ఈ ) కొత్త ఆర్డర్ జారీ చేసింది. విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన సమయంలో తాత్కాలిక యూడీఫ్ ఖరారు చేశారు. ఇప్పుడు కొత్త టారిఫ్ లు ఖరారు చేస్తూ నిర్ణయం వెలువడింది. భోగాపురం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణించేవాళ్ళు ప్రస్తుతం దేశీయ ప్రయాణికులు 835 రూపాయలు యూడీఎఫ్ చెల్లిస్తున్నారు. ఈ ఎయిర్ పోర్ట్ లో దిగిన వాళ్ళు 355 రూపాయలు ఫీజు చెల్లిస్తున్నారు. ఇవి అన్ని కూడా టికెట్ ధరలో భాగంగానే ఉంటాయి. భోగాపురం ఎయిర్ పోర్ట్ నుంచి అంతర్జాతీయ ప్రయాణికులు 1255 యూడీఫ్ చెల్లిస్తుంటే...అంతర్జాతీయ గమ్యస్థానాల నుంచి దిగిన వాళ్ళు 545 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ రేట్లలో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి.
కొత్త టారిఫ్ ఆర్డర్ ప్రకారం 2026 డిసెంబర్ 1 నుంచి దేశీయ ప్రయాణికుల యూడీఫ్ 890 రూపాయలకు చేరనుంది. ఎయిర్ పోర్ట్ లో దిగే వాళ్ళు 445 రూపాయలు యూడీఫ్ కట్టాలి. అంతర్జాతీయ ప్రయాణికుల చార్జీలు 1395 రూపాయలు, 698 రూపాయలుగా నిర్ణయించారు. ఇవి కేవలం నాలుగు నెలలకు మాత్రమే. 2027 ఏప్రిల్ నుంచి దేశీయ ప్రయాణికుల చార్జీలు 1040 రూపాయలు, 520 రూపాయలుగా నిర్ణయించారు. అంతర్జాతీయ ప్రయాణికులు చెల్లించాల్సిన మొత్తం 1495 రూపాయలు, 748 రూపాయలుగా ఉంది. తొలి ఐదేళ్ల కాలానికి టారిఫ్ ఫిక్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం 2030 ఏప్రిల్ 1 నాటికీ దేశీయ ప్రయాణికులు యూడీఎఫ్ 1325 రూపాయలకు పెరగనుంది. అంతర్జాతీయ ప్రయాణికుల యూడీఫ్ ఏకంగా 2195 రూపాయలకు చేరనుంది. ఇదే కాలంలో ఈ ఎయిర్ పోర్ట్ లో దిగే దేశీయ ప్రయాణికులు 663 రూపాయలు..అంతర్జాతీయ ప్రయాణికులు 1098 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్