ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి దుమ్మురేపింది. ఈ ఫలితాలు ఇంకా దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరాలు ఉన్న కూటమి ప్రభుత్వానికి రాజకీయంగాFull Viewఅద్భుత ఫలితాల కిందే లెక్క. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఫలితాలు వచ్చాయి. త్వరలో జరగనున్న జడ్పీటిసి, ఎంపీటిసి ఎన్నికల్లో కూడా ఫలితాలు ఇదే ట్రెండ్ ను కొనసాగించే అవకాశం లేకపోలేదు. ఇంత వరకు బాగానే ఉంది. ఇప్పటికే కూటమిలోని కీలక నేతలు అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు ఈ ఫలితాల జోష్ తో మరింతగా మారిపోతారా అన్న చర్చ టీడీపి, జనసేన నేతల్లో సాగుతోంది. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ టర్మ్ లో సీనియర్ నేతలకు...ఎమ్మెల్యేలకు కూడా సమయం కేటాయించటం లేదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే వాళ్లకు ఆయనతో మాట్లాడే ఛాన్స్ దక్కుతోంది. ఇక జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన మంత్రిగా ఎప్పుడు బాధ్యతలు నిర్వహిస్తారో ఎవరికీ తెలియదు...సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా కలవరు అనే అభిప్రాయం జనసేన నేతల్లోనే ఉంది.

                                   అనధికారికంగా ఒకటి...రెండు శాఖలు మినహా ప్రభుత్వాన్ని అంతా తానే నడిపిస్తున్నారు అనే ప్రచారం ఉన్న టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ రాబోయే రోజుల్లో మరింత దూకుడు చూపిస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది టీడీపీ నేతల్లో. చంద్రబాబు తరహాలోనే నారా లోకేష్ కూడా సీనియర్లను పెద్దగా పట్టించుకోకుండా తన టీం తోనే అంతా నడిపిస్తున్నారు అని పార్టీ నాయకులు చెపుతున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సీట్ల కేటాయింపు విషయంలో టీడీపీ, జనసేన మధ్య పలుమార్లు విబేధాలు తలెత్తాయి. అవి ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయా అనే సందేహం కొంత మంది నేతల్లో వ్యక్తం అయింది. కారణాలు ఏమైనా కూడా ఈ ఎన్నికల్లో కూడా కూటమి క్లీన్ స్వీప్ చేయటంతో ఆయా పార్టీల అగ్రనేతలు ఇక తమ వ్యూహాలకు తిరుగులేదు అనే అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు ఈ జోష్ తో తాము చెప్పే మాటలకు బిన్నంగా ఎవరైనా మాట్లాడితే సహించే ఛాన్సులు ఏ మాత్రం ఉండవు అనే భయం టీడీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పార్టీల్లో...ప్రభుత్వం లో నిర్ణయాలు అన్నీ కూడా కేంద్రీకృతంగా సాగుతున్నాయి అని... రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.

                                                    రాజకీయంగా ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సరిగ్గా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది. అప్పుడు వైసీపీ కూడా స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైందో అంతా చూశారు. సహజంగా ఏ రాష్ట్రంలో అయినా సరే స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయనే విషయం తెలిసిందే. ఇంకా రెండున్నర సంవత్సరాల పదవి కాలం ఉన్న ప్రభుత్వ అభ్యర్థులకు కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు ఓట్లు వేయటం వల్ల పెద్దగా ఎలాంటి ప్రయోజనం ఉండదు అనే కోణంలోనే పట్టణ ఓటర్లు అధికార పార్టీ వైపు మొగ్గుచూపుతారు. ఈ సారి ఎన్నికల్లో కూడా అదే జరిగింది. మరి తాజా గెలుపును కూటమి ఎలా మార్చుకుంటుంది అన్నది భవిష్యత్ లో కానీ తేలదు. ప్రస్తుతం టీడీపీ, జనసేనల్లో పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక వైపు గెలుపు ఆనందం ఉన్నా కూడా రాబోయే రోజుల్లో కీలక నేతలు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది అనే ఆందోళన కొంత మంది నేతల్లో ఉంది. 

Tags: