Full Viewఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా అవార్డు లను పునరుద్దరించటానికి రంగం సిద్ధం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డ్ ల పేరుతో ప్రతి ఏటా వివిధ కేటగిరీల్లో అవార్డులు ఇచ్చేవారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయిన ఈ అవార్డ్ లు తిరిగి ప్రారంభం కానున్నాయి. 2025 సంవత్సరానికి గాను జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ ఎంపిక కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ జ్యూరీ కమిటీకి ప్రముఖ హీరో..హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. బాలకృష్ణ చైర్మన్ గా ఉన్న ఈ కమిటీలో అల్లు అరవింద్, ఎస్ గోపాల్ రెడ్డి, ప్రభ సభ్యులుగా ఉన్నారు.
2025 సంవత్సరం జాతీయ అవార్డులకు ఒక కమిటీ ...అదే సమయంలో 2017 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు జాతీయ అవార్డ్ ల ఎంపిక మరో కమిటీని నియమించారు. ఈ జ్యూరీ కమిటీ కూడా చైర్మన్ గా కూడా బాలకృష్ణే ఉన్నారు. సభ్యులుగా మాత్రం వరప్రసాద్ రెడ్డి, సుద్దాల అశోక్ తేజ, కైకాల నాగేశ్వర్ రావు సభ్యులుగా ఉన్నారు. ఈ రెండు కమిటీల్లో కూడా ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ సభ్య కన్వీనర్ గా ఉంటారు. ఈ లెక్కన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒకే సారి తొమ్మిది సంవత్సరాలకు సినిమా జాతీయ అవార్డ్ లను ప్రకటించనుంది.