రాహుల్ నైట్ క్ల‌బ్ పార్టీపై విజ‌య‌సాయిరెడ్డి

Update: 2022-05-03 15:27 GMT

వైసీపీ కూడా కాంగ్రెస్ నేత రాహుల్ నేపాల్ నైట్ క్ల‌బ్ పార్టీ వ్య‌వ‌హారంపై స్పందించింది. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ లో ఈ అంశంపై స్పందించారు. ''చైనా దౌత్యవేత్తలతో కలిసి నేపాల్ నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ పార్టీ చేసుకుంటున్న వీడియో చైనా హనీ ట్రాప్‌లు పెరుగుతుండడం కలవరపెడుతోంది.నేపాల్‌లోని చైనీస్ రాయబారి హౌ యాంకీ రాహుల్ గాంధీతో ఉంది.

కాంగ్రెస్ పార్టీ సొంత నేత ఇలా చేస్తున్నప్పుడు ప్రధాని మోదీ యూరోప్ పర్యటనను అనవసరంగా ప్రశ్నించింది'' అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. దేశ‌వ్యాప్తంగా మంగ‌ళ‌వారం నాడు దేశంలో ఇదే హాట్ టాపిక్ గా మారిన విష‌యం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విమ‌ర్శ‌ల‌పై గ‌ట్టిగా జ‌వాబు ఇచ్చింది. ఒక‌రిపై ఒక‌రు దీనిపై దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

Tags:    

Similar News