పవన్ కళ్యాణ్ ఎన్నికల 'యుద్ధ ట్యాంక్' సిద్ధం

Update: 2022-12-07 12:28 GMT

Full Viewరాజకీయాల్లోకి వచ్చిన సినిమా హీరో లు అక్కడ కూడా సినిమాటిక్ కల్చర్ తేవటానికి చూస్తారు. గతంలోనూ ఇది జరిగింది..ఇప్పుడూ జరుగుతోంది. కాకపోతే పాత్రధారులు మారుతుంటారు అంతే. ఇప్పుడూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అచ్చం అదే పని చేశారు. వచ్చే ఎన్నిక ప్రచారం కోసం అయన ఒక ప్రత్యేక వాహనం సిద్ధం చేయించుకున్నారు. అది సైన్యం ఉపయోగించే యుద్ధ ట్యాంక్ తరహాలో ఉండటం విశేషం. ఈ వాహనానికి వారాహి అనే పేరు పెట్టారు. వారాహి... రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ అనే టాగ్ లైన్ తో ఈ ఫోటోలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. దీనిపై జనసేన ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

                           జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది. ఈ వాహనాన్ని, ట్రయల్ రన్ ను పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు. వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను చర్చించారు. దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు... వారాహి . ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు... ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు అని వెల్లడించారు.

'

Tags:    

Similar News