ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన ఆడిందే అట. పాడిందే పాట. ఆయన ఏమి చేసినా అడిగేవాళ్ళు లేరు. ఇదేంటి అని ప్రశ్నించే సాహసం కూడా ఎవరూ చేయరు. విచిత్రం ఏమిటి అంటే ఆయన సొంతంగా ఏ పని కూడా చేయరు. అంతా తెరవెనక ఉండి ఎవరో ఒకరు కథ నడిపిస్తుంటారు. ఆయన మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. పైకి మాత్రం తాను రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్నట్లు తెగ కలరింగ్ ఇస్తుంటారు గతంలో ఆయన శాఖలో టెండర్ల వ్యవహారం మొత్తాన్ని ఒక పవర్ బ్రోకర్ చూసుకున్నారు. ఆయనే అన్ని వసూళ్లు చేసి ఆ నేత చెప్పిన చోట అవి చేర్చేవాళ్ళు. దీంతో తన చేతికి ఏమి మట్టి అంటకుండా ఎవరికీ తెలియకుండా పని చేశాను అని ఆ మంత్రి సంతృప్తి చెందేవాళ్ళు. కానీ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరికీ ఇచ్చింది...ఎందుకు ఇచ్చింది చెప్పకుండా ఉంటారా?. అయినా కూడా మన పేరు మాత్రం బయటకు రాదు కదా...వ్యవహారం అంతా కూడా ఎవరిపేరు మీదో సాగుతుంది కదా అని ఆయన బలంగా నమ్ముతారు అనుకుంటా. వ్యవహారం ఎప్పుడైనా బయటకు వస్తే తనకు తెలియకుండా జరిగిపోయింది అని చెప్పుకోవటానికి ఆయన ఒక స్కెచ్ సిద్ధం చేసుకుని ఉంటారు.

                                   అటు ప్రభుత్వంలో ఉండే మంత్రులతో పాటు అధికారులకు కూడా తెలుసు. ఏది ఎందుకు...ఎవరితో చేయించుతున్నారో అని. గతంలో పవర్ బ్రోకర్ చూసుకున్న ఆ శాఖ టెండర్ల వ్యవహారం ఇప్పుడు మరో మంత్రికి అప్పగించారు. అంటే ఒక మంత్రికి చెందిన శాఖలో టెండర్ల ఖరారు...వసూళ్లు మరో మంత్రి చేసిపెడుతున్నారు అన్న మాట. ఎందుకంటే ఆయనకు ఇందులో విశేష అనుభవం ఉంది. అంటే వేల కోట్ల రూపాయల పనులు ఎవరికి ఇవ్వాలో ముందే ఫిక్స్ చేసుకుని ఈ మేరకు వసూళ్లు చేస్తున్నట్లు ఒక ఐఏఎస్ అధికారి వెల్లడించారు.ఈ దఫా దగ్గర దగ్గర పది వేల కోట్ల రూపాయలకు పైగానే పనులు వివిధ సంస్థలకు కేటాయిస్తున్నారు. దీనికి గాను పవర్ బ్రోకర్ బదులు ఈ వసూళ్లు...పనులు అప్పగించే బాధ్యతలు చేపట్టిన మంత్రి ప్రతి పనికి ఆరు శాతం ..ప్లస్ మరో వన్ పర్సెంట్ అంటే మొత్తం కలుపుకుని ఏడు శాతం లెక్కన వసూళ్లు చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

                                   ఇందులో ఆరు శాతం వసూళ్లు అసలు మంత్రికి వెళతాయి అని..మిగిలిన ఒక శాతం ఎవరికి వెళుతుంది...అది వసూలు చేసే మంత్రి ఖాతాలోకా లేక మరెవరికైనా అన్నది మాత్రం స్పష్టత లేదు అని చెపుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఈ సారి ఎన్నో వింతలు చోటు చేసుకుంటున్నాయి. అందులో ఈ మంత్రి వసూళ్ల వ్యవహారం ఒక కొత్త మోడల్ గా మారింది. బహుశా దేశంలోనే ఇంత సుఖపురుషుడు అయిన మంత్రి మరొకరు ఉండరు అనే చర్చ ఏపీ క్యాబినెట్ మంత్రుల్లోనే జోరుగా సాగుతోంది. అందుకే ప్రభుత్వంలో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నా కూడా ఎవరికి వాళ్ళు అంతా గప్ చూపు గా పని కానిచ్చేసుకుంటున్నారు.

Tags: