వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కె రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె బిజెపిపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఏపీలో బీజేపీకి అసెంబ్లీ సీటు కాదు కదా....అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. బద్వేలు ఉప ఎన్నికలో ఆ పార్టీ బరిలో నిలిచి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ బరిలో లేకపోయినా ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.
దీంతోపాటు జనసేన కూడా మద్దతు ప్రకటించింది. ఇదిలా ఉంటే వైసీపీకి ఓటు వేసిన బద్వేలు ప్రజలందరికి కృతజ్ఞతలు అన్నారు రోజా. ఏ ఎన్నికలైనా... సెంటర్ ఏదైనా వైసీపీదే విజయం అని వ్యాఖ్యానించారు. పార్టీ సంక్షేమ పథకాల అమలే తమ గెలుపుకు కారణం అని, సింగిల్ హ్యాండ్ తో గెలిపించిన ఘనత జగన్ కే దక్కిందన్నారు. వైసీపీ అభ్యర్ధి దాసరి సుధ ఘన విజయం సాధించారు.