ఏపీలోని అధికారులకు హైకోర్టు వరస పెట్టి షాకులు ఇస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇద్దరు ఐఏఎస్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సారి పోలీసు అధికారి వంతు అయింది. విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు వారం రోజులపాటు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా కోర్టును ఏసీపీ తప్పుదోవ పట్టించారని హైకోర్టు మండిపడింది. ఎస్సీ, ఎస్టీ కేసులో ఛార్జిషీట్ వేయాలని ఆదేశించినా ఏసీపీ శ్రీనివాసరావు పట్టించుకోలేదని హైకోర్టు తప్పుబట్టింది. ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును హైకోర్టు వారంరోజులు వాయిదా వేసింది.