గతంలో ప్రకటించినట్లుగానే ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్ సీ) నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లోనూ ఇంటర్వూలను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 సహా అన్ని కేటగిరీల పోస్టులకూ ఇంటర్వూలను మినహాయిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. పోటీ పరీక్షల్లో పూర్తి పారదర్శకత కోసమే ఎంపిక ప్రక్రియలో ఇంటర్వూలను ఎత్తివేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.