సీబీఐ కోర్టు మరోసారి జగన్ తరపు న్యాయవాదులకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది. లాక్‌డౌన్ తదితర కారణాల వలన కౌంటర్ దాఖలు చేయలేదన్న జగన్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే గతంలో ఇదే చివరి ఛాన్స్ అని..సీబీఐ కోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరోసారి ఛాన్స్ ఇచ్చి.. జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకుంటే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.