ప్రియురాలు బైక్ పై తిరిగింది అని ఆత్మహత్యాయత్నం!

Update: 2023-03-20 04:35 GMT

ఇప్పటివరకు ఇలాంటి ఘటన బహుశా దేశంలో ఎక్కడా జరిగి ఉండదేమో. అమ్మాయిలపై రకరకాల ఆంక్షలు పెడతారు అనే విషయం తెలిసిందే. కానీ ఇది మాత్రం ఒక కొత్త తరహా పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే తాను ప్రేమించిన అమ్మాయి బైక్ పై తిరగటం అతడికి నచ్చలేదట. ఆలా బైక్ పై తిరగొద్దు అని చెప్పినా ఆ అమ్మాయి నా ఇష్టం నీకు నచ్చినట్లు చేసుకో అని చెప్పేసింది. దీంతో ఆ యువకుడు అమ్మాయి ఇంటిపైకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఎనభై శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గుడివాడ లో కలకలం రేపింది. గుడివాడ లో నివాసం ఉండే బవర్ సింగ్ రెండవ కొడుకు శైలేష్ సింగ్ అదే పట్టణానికి చెందిన ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు.

                                 ఆమె ఇటీవలే బైక్ కొనుగోలు చేసి దానిపై తిరగటం అతనికి ఏ మాత్రం నచ్చలేదు. వద్దు అని చెప్పినా వినకపోవడం తో ఆత్మహత్యాయత్నం చేసాడు  శైలేష్ సింగ్ పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం తరలించారు. ఆ యువకుడు ఆత్మహత్యాయత్నం కారణం తెలిసి విస్తుపోవటం ప్రతిఒక్కరి వంతు అయింది. యువత మరీ ఇంత సున్నితంగా మారుతున్నారా లేక...ఇంత చిన్న ఘటనకు కూడా ఆత్మహత్య అంటే ఊహించటం కూడా కష్టంగా ఉంది అని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News