జగన్ తన బూతులు మర్చిపోయారు !

Update: 2022-10-20 14:13 GMT

అప్పుడు అదే డైలాగు ..ఇప్పుడు అదే డైలాగు. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు కూడా ఒంటరిగానే వచ్చి 50 శాతం ఓట్లు..151 సీట్లు దక్కించుకున్నారు. ఒక్కడిపై అందరూ కలిసి పోరాటం చేస్తున్నారు అంటే అప్పుడు నడిచిపోయింది. కానీ ఇప్పుడు జగన్ ఒంటరి కాదు. అధికారం అనే ఆయుధం తో ఉన్నారనే విషయాన్నిమర్చిపోయారా లేక ఇంకా పాత సెంటిమెంట్ ను వాడుకోవాలని చూస్తున్నారా అంటే సెంటిమెంట్ డైలాగు లే కనిపిస్తున్నాయి. తాను మూడు రాజధానులతో మేలు చేయాలనీ చూస్తుంటే .కొంతమంది మూడు..నాలుగు పెళ్లిళ్లు చేసుకోమని చెపుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ పై ఎటాక్ చేశారు. వీళ్లా మన నాయకులూ అని ఎద్దేవా చేశారు. కొంతమంది బూతులు మాట్లాడుతూ .చెప్పులు చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. నిజమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలా చేసి ఉండాల్సింది కాదు. కానీ జగన్ తన మంత్రివర్గంలో ఉన్న కొంత మంది మంత్రులు ప్రతిపక్ష నాయకులను అడ్డగోలుగా బూతులు మాట్లాడితే ..దుర్భాషలు చేసినప్పుడు జగన్ కనీసం వారిని మందలించి ఉంటే ఇప్పుడు జగన్ చెడుపుతున్న మాటలకూ విలువ వచ్చి ఉండేది.

                        కానీ జగన్ ఆ పని ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు. ఎవరు తప్పు మాట్లాడిన ఖచ్చితంగా ఖండించాలిసిందే. ఈ విషయం లో అధికారం లో ఉన్నవాళ్లకు ఎక్కువ బాధ్యత ఉంటుందన్న విషయం తెలిసిందే. Full Viewకానీ అధికారం పార్టీ నాయకులూ..మంత్రులు కూడా ఇష్టానుసారం మాట్లాడం...అదే బాష ఎవరైనా వాడితే మాత్రం ఎక్కడ లేని నీతులు చెప్పటంతోనే సమస్యలు వస్తున్నాయి. అసలు ఈ బూతుల బాష ఎవరు ఫస్ట్ మొదలు పెట్టారు అంటే చెప్పటం కష్టం కానీ..అధికారంలో ఉండగా కొంత మంది టీడీపీ నేతలు కూడా అసెంబ్లీ లో బూతులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అయితే ఏకంగా కొంత మంది మంత్రులే టార్గెట్ చేసిన నేతలను ఇష్టానుసారం దూషిస్తున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం వాటిని పూర్తిగా వదిలేసి ప్రతిపక్షాలు ఒక్కటే బూతులు మాట్లాడుతున్నాయి ..మా వాళ్ళు అంతా క్లీన్ అన్న చందంగా మాట్లాడుతున్నారు. ఇది ఒక్కటే కాదు సీఎం జగన్ స్వయంగా పలు బహిరంగ సభల్లోనే యాక్షన్ చేస్తూ మరి ఎవడు నా వెంట్రుక కూడా పీక లేరు అంటూ మాట్లాడిన విషయం మర్చిపోయి నట్లు ఉన్నారు. 

Tags:    

Similar News