అయితే మితిమీరి పవన్ ను అనరాని మాటలు అంటున్నప్పుడు బాధ కలుగుతుంది. పైగా పవన్‌ను తిట్టినవాళ్లు మళ్లీ నా దగ్గరకు వచ్చి పెళ్లిళ్లకు, పేరంటాలకు పిలుస్తారు. రమ్మని బతిమాలతారు. 'నా తమ్ముడిని అన్ని మాటలు అన్నవాళ్లతో మళ్లీ మాట్లాడాల్సి వస్తోందే.. వాళ్లను కలవాల్సి వస్తుంది అంటూ సంచలన వ్యాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ కు కించిత్ స్వార్థం కూడా లేదు...డబ్బు యావ లేదు. పదవీ కాంక్ష లేదు. తన కోసం ఎప్పుడూ ఆలోచించుకోడు. నేను ఒక అన్నగా చెప్పడంలేదు. తనని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెబుతున్నా. అంతెందుకు.. మొన్నటిదాకా వాడికి సొంత ఇల్లు లేదు. మా అందరికీ ఉన్నాయి.. నువ్వు కూడా కట్టుకో..'' అంటే.. ''చూద్దాం'' అని దాటేసేవాడు అంటూ చెప్పారు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి . ప్రస్తుతం జగన్ కాబినెట్ లో ఉన్న కొంత మంది మంత్రులు , మాజీ మంత్రులకు సంబంధించి ఆడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. వాటిపై మాత్రం ప్రభుత్వం ఎక్కడగా కాంక్రీట్ గా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.