టీడీపీ నాయకులే షాక్ అయ్యేలా యువ మంత్రి టీం వ్యవహారాలు

Update: 2025-01-21 05:06 GMT

ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి సర్కారు మరో భారీ లడ్డూ ను వదిలేసిందా?. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎవరైనా సరే దేన్నీ కూడా ఊరికే వదిలేయరు . దేని లెక్కలు దానికుంటాయి. ఇప్పుడు ఈ భారీ లడ్డూ ను వదిలేయటం విషయంలో కూడా అదే జరిగింది. ఇలా వదిలేయటం వెనక ఏమైనా భారీ స్కాం జరిగిందా అంటే అవుననే చెపుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఒక స్కాం ను కవర్ చేయటానికి మరో స్కాం అన్న మాట. రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సెటిల్ మెంట్స్ మాత్రమే సాగుతున్నాయి అనే విమర్శలు ఉన్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా ఇదే విషయాన్ని దృవ పరుస్తున్నాయి. వాస్తవానికి ఈ కేసు తో రాజకీయంగా ప్రత్యర్ధులు అయిన ఎంతో మందిని...కీలక వ్యక్తులను ఒక్క దెబ్బకు అడ్డంగా బుక్ చేయవచ్చు. అయినా సరే అలవాటుపడిన ప్రాణం ఎప్పుడూ డబ్బు వైపే చూస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా అదే పని చేశారు.

                                                    ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ఒక కీలక యువ మంత్రి, కిమ్ తో పాటు ఒక రాజ్య సభ సభ్యుడు కలిసి ఈ ఫ్రెష్ లడ్డూ సెటిల్మెంట్స్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. ఇందులో అత్యంత కీలక పాత్ర పోషించింది వైసీపీ కి చెందిన ఒక రాజ్య సభ సభ్యుడు. ఇది ఒక్కటే కాదు..ఆయన వైజాగ్ కు చెందిన పలు అంశాల్లో కూడా ఇదే బ్యాచ్ తో సెటిల్మెంట్స్ చేస్తున్నారు. అందుకే ఎంతో టెన్షన్ తో ఉండాల్సిన వైసీపీ కీలక నేతలు అంతా హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వ్యవ్యహారంలో వేలు..వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. చట్టపరంగా బుక్ చేయలేని వాటిలో ఏదో రాజీకి వచ్చారు అంటే కొంతలో కొంత అర్ధం చేసుకోవచ్చు అని..కానీ వందకు వంద శాతం బుక్ అయ్యే కేసుల్లో రాజకీయ ప్రత్యర్థులతో...అది కూడా అధికారంలో ఉండగా అడ్డగోలుగా తిట్టిన...విమర్శించిన వాళ్ళతో కలిసి డీల్స్ సెట్ చేసుకుంటున్నారు అంటే పరిస్థితి ఇంత దారుణంగా మారుతుంది అని ఎప్పుడూ ఊహించలేదు అని ఒక మంత్రి వాపోయారు.

                                                 కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు మీడియా తో మాట్లాడుతూ జగన్ పై చర్యలు తీసుకోవటానికి సెకి తో కుదిరిన ఒప్పందం తమకు లడ్డూ లాంటి అవకాశం అని..అయినా తాము కక్ష తీర్చుకోవటం కోసం జగన్ అరెస్ట్ వంటి పనులు చేయలేదు అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. పైకి ఆయన చెప్పిన విషయం ఒకటి అయినా తెర వెనక చాలా వ్యవహారాలు జరుగుతున్నాయి అనే విషయం అధికార వర్గాల్లోనే ప్రచారంలో ఉంది. కాకినాడ పోర్ట్ లో వాటాలను బలవంతంగా లాక్కున్నారు అంటూ కొద్ది రోజుల క్రితం కె వి రావు పెట్టిన కేసు విత్ డ్రా కాబోతుంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఎందుకంటే ఇందులో ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి.

Similar News