ఇదేమి పాలన?. జగన్ పై చంద్రబాబు ఫైర్

Update: 2021-04-15 12:12 GMT

ముఖ్యమంత్రి జగన్ తీరుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎన్నో అక్రమాలు...అవినీతి జరుగుతున్నా సీఎం జగన్ డోన్డ్ డిస్టర్బ్ మీ అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇదేమి పాలన..ఇదెక్కడి తీరు అంటూ విమర్శలు గుప్పించారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించిన చంద్రబాబు ప్రచారం ముగించుకుని మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్ సకాలంలో ఇవ్వడంలేదని, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారనన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ నెల ఇస్తే... వచ్చే నెల ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొందని తెలిపారు. కుక్కలు చింపిన విస్తరిలా రాష్ట్రంలో పాలన మారిందని విమర్శించారు. ఎక్కడికక్కడ అప్పులు చేస్తున్నారు. ఉద్యోగులకు టీఏ, డీఏ ఇవ్వడం లేదు. సీపీఎస్ అతీగతీ లేదు. పీఆర్సీ కమిటీ వరకే ఆగిపోయింది. పాలనానుభవం లేకపోవడంతో... కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు.

ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో సీఎం ఉన్నాడు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 164 ఆలయాలపై దాడులు జరిగితే... ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. ఎప్పుడూ జరగనిది.. ఈ రెండేళ్ల పాలనలో జరిగాయి. రామతీర్థంలో నాపై కేసులు పెట్టారు. హక్కుగా, బాధ్యతగా వెళితే... నాపై తప్పుడు కేసులు పెట్టారు. తిరుపతిలో రాళ్లు వేస్తారు. నన్నే సాక్ష్యం ఇమ్మంటున్నారు. దొంగతనం జరిగితే మనమే దొంగల్ని పట్టుకోవాలా... మీడియా సమక్షంలోనే జరిగింది. నాసిరకం మద్యంతో జనం అనారోగ్యం పాలవుతున్నారు. ఈ సీఎం ఆనందిస్తున్నాడు తప్ప... తప్పును సరి చేసుకోవడం లేదు'' అని విమర్శించారు.

Tags:    

Similar News