ఇండియా ఫైనల్స్ కు చేరితే మళ్ళీ వెళతా

Update: 2026-02-23 13:48 GMT

ఆంధ్ర ప్రదేశ్ ఐటి, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. టి ట్వంటీ వరల్డ్ కప్ లో ఇండియా ఫైనల్ కు చేరితే ఆ మ్యాచ్ కు కూడా వెళతానని ...మ్యాచ్ చూడటానికి వస్తే జగన్ కు కూడా టికెట్ కొంటానన్నారు. ఇటీవల నారా లోకేష్ ఇండియా-పాకిస్థాన్ ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ చూడటానికి నారా లోకేష్ ఆ పార్టీ ఎంపీ సానా సతీష్ తో కలిసి శ్రీలంక వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. క్రికెట్ మ్యాచ్ చూడటానికి శ్రీలంక వెళ్లాలా...ఇంట్లో ఉంది టీవీ లో చూడొచ్చు కదా అంటూ విమర్శించారు. దీనికి కౌంటర్ గానే నారా లోకేష్ సోమవారం నాడు అసెంబ్లీ లో మీడియా తో చిట్ చాట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ తన వ్యాఖ్యల ద్వారా క్రికెట్ మ్యాచ్ ల విషయంలో తనపై విమర్శలు చేసిన వాళ్ళు అందరికి కౌంటర్ ఇచ్చినట్లు అయింది అనే చర్చ సాగుతోంది. మరో వైపు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో సాక్షి, భారతి సిమెంట్స్ ప్రభుత్వం నుంచి వెయ్యి కోట్ల రూపాయల మేర లబ్దిపొందాయని ఆరోపించారు.

                             తమ కంపెనీ హెరిటేజ్ మాత్రం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ప్రయోజనం పొందలేదు అన్నారు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ కు కో కంపెనీ అని బొత్స సత్యనారాయణ మాట్లాడటం విచిత్రంగా ఉంది అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా హెరిటేజ్ పై సెబీ కి ఫిర్యాదు చేశారు అని నారా లోకేష్ తెలిపారు. అసలు కో కంపెనీ అనేది ఉండదు అనే విషయం బొత్స కు తెలియదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలతో తన ఆత్మీయ సమావేశాల గురించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నారా లోకేష్. యువ గళం తర్వాత చాలా గ్యాప్ వచ్చింది అని...అందుకే ఇప్పుడు ఎమ్మెల్యే లతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో సమావేశం అవుతున్నట్లు తెలిపారు. అక్కడ అసలు రాజకీయ విషయాలకు ఛాన్స్ ఉండదు అన్నారు. Full Viewకిలో నెయ్యి 360 రూపాయలకు ఎక్కడ దొరికినా అది కల్తీ నెయ్యే అన్నారు.

Tags:    

Similar News