వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును తెలంగాణ మంత్రి కెటీఆర్ తప్పుపట్టారు. ఒకే దేశం..ఒకే పన్ను (జీఎస్టీ)ని తాము అంగీకరించామని..కానీ ఇఫ్పుడు ఒకే దేశం రెండు వ్యాక్సిన్ ధరలు ఎందుకు? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ డోసు 150 రూపాయలకు, రాష్ట్రాలకు మాత్రం 600 రూపాయలకు సరఫరా చేయటం ఏమిటని ప్రశ్నించారు.
పీఎం కేర్స్ నిధులను సమకూర్చి దేశమంతటా అత్యంత వేగంగా వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయలేరా అని ప్రశ్నించారు. వ్యాక్సిన్ కు సంబంధించిన రెండు ధరల విధానంపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. కేంద్రం తీరు ఏ మాత్రం సరికాదు అంది. అన్నింటికి ఒకే దేశం..ఒకే విధానం అని చెప్పే మోడీ వ్యాక్సిన్ విషయంలో మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించింది.