తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ లోని మంత్రుల్లో కొంత మందిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నా కూడా ఒక కీలక మంత్రి వ్యవహారం మాత్రం మరింత దారుణంగా ఉంది అని చర్చ సాగుతోంది. ఎందుకంటే కొంత మంది మంత్రులే నేరుగా అన్ని తెర వెనక వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. వీటికి సంబందించి పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా సాగుతున్నాయి. కాకపోతే తెలంగాణా క్యాబినెట్ లో ఒక కీలక మంత్రికి చెందిన ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఇదే పనిలో నిమగ్నం అయ్యారు అనే చర్చ కాంగ్రెస్ నేతల్లోనే సాగుతోంది. కీలక శాఖలు చూస్తున్న ఆ మంత్రి పై నుంచి అన్ని వ్యవహారాలు చూస్తుంటే వసూళ్లు అంతా ఆయన భార్య చూస్తున్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.
ఆ మంత్రి కి చెందిన కీలక శాఖల్లో పోస్టింగ్ ల దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకూ అంతా ఆమె కనుసన్నల్లోనే సాగుతోంది అని అధికార వర్గాలు కూడా చెపుతున్నాయి. ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తప్ప ఫైల్ ముందుకు కదలదు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇక్కడ మరో దారుణ విషయం ఏమిటి అంటే ఆయా శాఖల్లో ఎంత కీలక పోస్ట్ అయినా సరే వాళ్ళు అనుకున్న మొత్తం వస్తే తప్ప ఆ పోస్ట్ భర్తీ చేయకుండా ఎంత కాలం అంటే అంత కాలం జాప్యం చేస్తున్నట్లు కూడా అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇలా పలు కీలక పోస్ట్ ల విషయంలో జరిగింది అని ఆయన వెల్లడించారు.
మంత్రి పర్యవేక్షణలో ఆయన భార్య వ్యవహారాలు ఇలా ఉంటే ఇప్పుడు కొత్తగా కొడుకు కూడా రంగంలోకి దిగినట్లు చెపుతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని కీలక ప్రాజెక్ట్ లను దక్కించుకోవటం కోసం అటు ఫ్యామిలీ తో పాటు తన భవిష్యత్ కోసం అంతా సెట్ చేసుకుంటే పనిలో ఉన్నట్లు చెపుతున్నారు. అయితే ఇలాంటి వ్యవహారమే ఒకటి ఇటీవల బాగా రివర్స్ కొట్టింది అనే ప్రచారం కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఫ్యామిలీ అంతా ఇప్పుడు అదే పనిలో ఉండటంతో ఆయనకు ఫ్యామిలీ ప్యాక్ మంత్రి అనే పేరు వచ్చింది అనే చర్చ కూడా కాంగ్రెస్ నాయకుల్లో ఉంది. మరి రాబోయే రోజుల్లో తాను అనుకున్న పని దక్కించుకునేందుకు ఎలాంటి మోడల్ ను ఎంచుకుంటారో చూడాలి. కొంత మంది మంత్రులు అయితే పదేళ్ల తర్వాత అధికారం వచ్చింది కదా అని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.