గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ మందకొడిగా సాగుతోంది. హై ఎండ్ ఇళ్లు, అపార్ట్మెంట్స్ కు ఉన్న డిమాండ్ మధ్య తరగతి..దిగువ మధ్య తరగతి బడ్జెట్ ఇళ్లకు ఉండటం లేదు. దీనికి ప్రధాన కారణం దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న పలు మార్పులే. రెండుళ్లు అయింది కదా ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ రికవరీ అవుతుంది అనే ఆశలో ఉన్న వాళ్లకు ఈ రంగంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది అనే భయాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఏఐ కి రియల్ ఎస్టేట్ రంగానికి నేరుగా ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా ...ఐటి ఉద్యోగాలకు ...రియల్ ఎస్టేట్ మార్కెట్ కు ఎంతో అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే విదేశాల్లో ఉద్యోగాలు చేసే తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతారు అనే విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఈ పెట్టుబడుల విషయంలో కూడా అనిశ్చితి నెలకొంది.
అమెరికా ప్రెసిడెంట్ గా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సృష్టించిన గందరగోళం కొన్ని రోజులు సాగితే...ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఐటి ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపించే పరిస్థితి ఉంది. 2025 సంవత్సరంలో ఏఐ కారణంగా ఏకంగా లక్ష ఉద్యోగాలు పోయినట్లు నివేదికలు చెపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 218 కంపెనీలు వీళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఏఐ కారణంగా వివిధ రంగాల్లో 2030 నాటికి ఉద్యోగాలు పోయే వాళ్ల సంఖ్య ఒక్క ఇండియాలో అయితే కోటి పైనే ఉంటుంది అని అంచనా. ఏఐ తో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నా కూడా ఐటి నిపుణులు ఇందుకు పూర్తి స్థాయిలో అప్డేట్ కావాల్సి ఉంటుంది. ఏఐ కారణంగా చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల ఇండియాలోని దిగ్గజ ఐటి కంపెనీల షేర్లు కూడా కుప్పకూలుతున్నాయి. అమెరికా కు చెందిన ఆంథ్రోపిక్ ఏఐ సంస్థ తీసుకొచ్చిన ఒక టూల్ ప్రభావం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఐటి షేర్లు కుప్పకూలాయి. దేశంలోని దిగ్గజ ఐటి కంపెనీ టిసిఎస్ షేర్ ధర ఈ శుక్రవారం నాడు 52 వారాల కనిష్ట స్థాయి 2579 రూపాయలను తాకింది. మరో దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ పరిస్థితి కూడా అదే. ఈ కంపెనీ షేర్ కూడా 52 వారాల కనిష్ట స్థాయి 1281 రూపాయలకు పతనం అయింది. ఇలా కీలక ఐటి కంపెనీలు షేర్ల ధరలు అన్ని కూడా వరసగా భారీగా పతనం అవుతూ వచ్చాయి. అంటే ఏఐ ఈ రంగంపై ఎంత ప్రభావం చూపిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ