తెలంగాణ‌లో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు

Update: 2021-12-15 05:57 GMT

ఒమిక్రాన్ వేరియంట్ క‌రోనా కేసుల జాబితాలో తెలంగాణ కూడా చేరింది. కొత్త‌గా రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు న‌మోదు అయిన‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. వీరంతా విదేశాల నుంచి వ‌చ్చిన‌వారే కావ‌టం గ‌మ‌నార్హం. అయితే ఆయా వ్య‌క్తుల కుటుంబ స‌భ్యుల‌ను ఐసోలేష‌న్ కు త‌ర‌లించిన‌ట్లు అదికారులు తెలిపారు. కెన్యా, సోమాలియాల నుంచి వ‌చ్చిన వారు ఒమిక్రాన్ వేరియంట్ బారిన‌ప‌డ్డారు. హైద‌రాబాద్ లోని శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి కోల్ క‌తాకు వెళ్ళిన వ్య‌క్తికి కూడా ఒమిక్రాన్ వైర‌స్ ఉన్నట్లు గుర్తించారు.

రాష్ట్రంలో మొత్తం మూడు కేసులు వెలుగుచూడ‌గా..ఇద్ద‌రు మాత్ర‌మే ఇక్క‌డ ఉన్నారు. అబుదాబి నుంచి వచ్చిన ఒక ప్రయాణీకుడికి, అలాగే కెన్యా నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా సోకినట్లు తేలింది. టోలిచౌకికి చెందిన ఆ మహిళ అడ్రస్‌ను రాత్రి తెలుసుకున్నట్లు వైద్య శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. రాష్ట్రంలోని వ్యక్తులకు ఒమైక్రాన్‌ సోకలేదని స్పష్టం చేసింది. ఒమైక్రాన్‌ సోకినవారిని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.

Tags:    

Similar News