తెలంగాణ ఆర్టీసీ ఛార్జీల పెంపు

Update: 2022-04-08 15:23 GMT

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ‌ర‌స పెట్టి ప్ర‌జ‌ల‌పై భారం మోపుతున్నాయి. ఓ వైపు ఇంథ‌న ధ‌ర‌లు అంత‌కంత‌కూ పెరుగుతుండ‌టంతో ఈ ప్ర‌భావం అన్ని వ‌ర్గాల‌పై ప‌డుతోంది. రాష్ట్ర స‌ర్కారు కూడా విద్యుత్ ఛార్జీల‌తోపాటు రిజిస్ట్రేష‌న్ చార్జీల‌ను కూడా పెంచింది. ఇప్పుడు మ‌రోసారి ఆర్టీసీ ఛార్జీల‌ను పెంచారు. డీజిల్‌ సెస్‌ ఛార్జీల పేరుతో బస్సు ఛార్జీలను పెంచుతున్నట్లు ఆర్టీసీ శుక్రవారం నాడు వెల్ల‌డించింది. పల్లెవెలుగు, సిటీ, ఆర్డినరీ సర్వీసులకు డీజిల్ సెస్ కింద రూ. 2 చొప్పున, ఎక్స్ ప్రెస్ , డీలక్స్ , సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసులకు రూ. 5 పెంచుతున్నట్టు వెల్లడించింది. బస్సు సర్వీసుల్లో కనీస టికెట్‌ ధరను రూ. 10 గా నిర్ణయించింది.

డీజిల్‌ ధరలు డీజిల్‌ ధరలు పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణీకుల ఛార్జీలపై డీజిల్ సెస్‌ విధించామని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌, చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీఎస్‌ ఆర్టీసీ అనివార్య పరిస్థితుల్లో తీసుకున్న డీజిల్ సెస్‌ నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకొని యాథావిధిగా సహకరించాలని కోరారు. పెరిగిన ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. టీఎస్‌ ఆర్టీసీ అనివార్య పరిస్థితుల్లో తీసుకున్న డీజిల్ సెస్‌ నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకొని యాథావిధిగా సహకరించాలని కోరారు. తాజాగా ఆర్టీసీ ఛార్జీల పెంపు భారీగానే ఉంది. ఇటీవ‌లే రౌండప్, టోల్ ఛార్జీలు, సెస్ ల పేరుతో స‌వ‌ర‌ణ చేప‌ట్టారు. ఇప్పుడు మరోసారి ప్ర‌యాణికుల‌పై భారం మోపారు.

Tags:    

Similar News