సీఎం కెసిఆర్, కెటిఆర్ సీబీఐకి భయపడినట్లేనా?!

Update: 2022-10-30 09:01 GMT

తెలంగాణ లో పాలనా అంత రహస్యమే. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆర్డర్లు వెబ్ సైటులో పెట్టేవారు.. రాష్ట్రం వచ్చిన తర్వాత అంతా పారదర్శక పాలన అని చెప్పుకోవటం తప్ప అది ఎక్కడ కనిపించదు.చివరకు సమాచార హక్కు చట్టం కింద వివరాలు తీసుకోవటాని కూడా ఎన్నో తిప్పలు పడాల్సిన పరిస్థితి. కెసిఆర్ సీఎం అయిన తర్వాత ఇక జీఓల సంగతి అయితే చెప్పక్కరలేదు. కోర్టులు జోక్యం చేసుకున్న పరిస్థితిలో పెద్దగా మార్పు లేదనే చెప్పొచ్చు. ప్రభుత్వ ప్రచారానికి పనికి వచ్చే జీఓలు అయితే అవి మాత్రం బయటకు వస్తాయి. కాంట్రాక్టుల కేటాయింపు, అంచనాల పెంపు, గోల్ మాల్ జీ ఓలు మాత్రం బయటకు రావు. ఇప్పుడు చాలా వరకు తెలంగాణాలో మీడియా అంతా వదిలేసినట్లే ఉంది. ఎప్పుడో ఒకసారి..ఎవరో ఒకరు అప్పుడపుడు మెరుపులు మెరిపించటం తప్ప..ప్రధాన మీడియా ప్రభుత్వంలో జరిగే చాలా విషయాలను ఏ మాత్రం పట్టించుకోవటం లేదు అని చెప్ప వచ్చు. ఇది కెసిఆర్ రహస్య పాలనా..మీడియా ఘోర వైఫల్యమా అన్న కోణంలోనూ చర్చ నడుస్తోంది. చివరకు రాష్ట్రం సీబీఐకి గతంలో ఇచ్చిన సాధారణ అనుమతిని రద్దు చేస్తూ జీఓ జారీ చేసింది. ఇది ఆగస్టు 30 న జారీ చేస్తే అది ఇప్పటి వరకు అంటే రెండు నెలల తర్వాత అక్టోబర్ 30 న బయటికి వచ్చింది. అంటే రాష్ట్రంలో ప్రధాన మీడియా ఇంత దారుణంగా మారిందా అని ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

వాస్తవానికి ఇదే అంశంపై గతంలో కూడా చర్చ జరిగింది. సీఎం కెసిఆర్ బీహార్లో ఇదే అంశంపై బహిరంగంగానే మాట్లాడారు. కానీ రాష్ట్రంలో సిబిఐ అనుమతి రద్దు చేస్తూ జీఓ జారీచేసిన ఏ ప్రధాన మీడియా సంస్థకు కూడా ఇప్పటి వరకు ఈ విషయం తెలియలేదు అంటే పరిస్థితి అంత దారుణంగా ఉందా అన్న చర్చ నడుస్తోంది. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా సీఎం కెసిఆర్, మంత్రి కేటిఆర్ లు ఈడీ, బోడి, సిబిఐ లు తమను ఏమి చేయలేవు అంటూ చెపుతూ వస్తున్నారు. అలాంటి అప్పుడు మరి సిబిఐ కి గతం లో ఉన్న సాధారణ అనుమతి ని ఎందుకు రద్దు చేసినట్లు అన్న అనుమానాలు రావటం ఖాయం. తాము ఏమి తప్పులు చేయలేదని..అందుకే ఎవరకి భయపడాల్సిన అవసరం లేదు అంటూ సీఎం కెసిఆర్ పలుమాలు మీడియా సమావేశాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే సీఎం కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు ఢిల్లీ మద్యం స్కాం లో వినిపించింది ఆగస్టు 23 ఆ సమయంలోనే. తెలంగాణ ప్రభుత్వం సిబిఐ అనుమతి రద్దు చేస్తూ జీ ఓ ఇచ్చిన తేదీ ఆగస్టు 30 న కావటం విశేషం.



Tags:    

Similar News