పెళ్ళి ముందు రోజు...ఇద్దరు కూతుళ్ళతో తల్లి ఆత్మహత్య

Update: 2020-12-10 05:25 GMT

తెల్లారితే ఆ ఇంట్లో పెళ్లి జరగాల్సి ఉంది. కానీ అంతలోనే దారుణ విషాదం. పెళ్ళికి అవసరమైన డబ్బులు సర్దుబాటు కాకపోవటంతో పెళ్ళి కుమార్తెతోపాటు ఆమె సోదరి, తల్లి ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదం గురువారం నాడు జరిగింది. ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన గోవిందమ్మ(48), ఆమె కూతుళ్లు రాధిక(30), రమ్య(28) బుధవారం అర్థరాత్రి బంగారం శుభ్రం చేసే రసాయనం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

ఆర్ధిక కష్టాలే దీనికి కారణం అని సమాచారం. ఇంటి పెద్దగా ఉన్న గోవిందమ్మ భర్త ఏ పనీ చేయకపోవటంతో ఎటు నుంచి కూడా డబ్బు వచ్చే మార్గం లేకుండా పోయింది. ఇంట్లో పెళ్లి వయస్సు వచ్చిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు రాధికకు డిసెంబర్‌ 11న పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి దగ్గరపడుతున్న సమయంలో డబ్బులు సర్దుబాటు కాకవడంతో మనస్తాపం చెందిన తల్లి, కూతుళ్లతో కలిసి తానువు చాలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Tags:    

Similar News