థియేటర్లు మూసివేసే ఆలోచన లేదు

Update: 2021-03-24 09:11 GMT

కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పాఠశాలలు, కాలేజీలు మూసివేతకు నిర్ణయం తీసుకున్న సర్కారు..థియేటర్లు కూడా మూసివేస్తుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. లేదంటే కనీసం 50 శాతంతో అనుమతించే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పందించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సినిమా దియేటర్లు యధావిధిగా నడుస్తాయని ఆయన స్పష్టం చేశారు. థియేటర్లు మూతపడుతాయని జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధం అన్నారు.

సినిమా దియేటర్ల మూసివేత పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చిత్ర పరిశ్రమ పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న అనేకమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రంగంపై ఆధారపడిన వివిధ విభాగాలలోని కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొన్నదని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలను తప్పనిసరిగా దియేటర్ల యాజమాన్యాలు పాటించాలన్నారు.

Tags:    

Similar News