తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్ళు

Update: 2021-01-11 10:46 GMT

తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి తొమ్మిదవ తరగతి, ఆపై తరగతుల వారికి స్కూళ్ళు కాలేజీలు ప్రారంభించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన సోమవారం నాడు జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు ప్రారంభించేలా అవసరం ఏర్పాట్లు చేయాలని కెసీఆర్ జిల్లా కలెక్టర్లు..అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు తిరిగి తెరుచుకునేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. సర్కారు తాజా నిర్ణయంతో పది నెలల తర్వాత 10 నెలల అనంతరం విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి.

ఇదిలా ఉంటే ధరణి పోర్టల్లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అన్నిశాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News