తెలంగాణ సెకండ్ ఇయ‌ర్ ఇంట‌ర్ ప‌రీక్షలు ర‌ద్దు

Update: 2021-06-09 07:32 GMT

క‌రోనా కార‌ణంగా తెలంగాణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్షలు ర‌ద్దు చేసి..ఇప్ప‌టికే మార్కులు కూడా జారీ చేసిన స‌ర్కారు.. ఇప్పుడు ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్షలు కూడా ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వులు రావ‌ట‌మే ఆల‌శ్యం. అయితే ర‌ద్దు విష‌యాన్ని ప్ర‌భుత్వం ఓ ప్రకటనలో వెల్ల‌డించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఇక ఇంటర్‌ సెకండియర్‌కు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల్లో విద్యార్థులందరికీ గరిష్ట మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫస్ట్‌ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులను ప్రకటిస్తారు. ఇంటర్‌ పరీక్షలను నిర్వహిస్తే మళ్లీ కరోనా వైరస్‌ విజృంభించే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స‌మాచారం.

Tags:    

Similar News