కరోనా మరణాలపై లేని స్పందన..దేవరయాంజాల్ భూములపై ఎందుకు?

Update: 2021-05-08 09:05 GMT

ఈ అంశంపై నలుగురు ఐఏఎస్ లతో కమిటీనా?

తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు

దేవరయాంజల్ భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రజలు కరోనాతో మరణిస్తుంటే లేని స్పందన..దేవరయాంజాల్ భూములపై ఎందుకు అని ప్రశ్నించింది. కరోనా విపత్తు వేళ ఈ అంశం నలుగురు ఐఏఎస్ లు విచారణ జరపాలా అని సర్కారు అడిగింది. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా జీవోలు ఇస్తారా? అంటూ ప్రశ్నల వేసింది. మేడ్చ‌ల్ జిల్లా శామీర్‌పేట మండ‌ల ప‌రిధిలోని దేవరయాంజల్ భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌పై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శనివారం విచారణ చేపట్టింది. ఈ నెల 3న ప్రభుత్వం జారీ చేసిన జీవో 1014ను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలైంది. దానిపై విచారణ జరిపిన హైకోర్టు.. రాష్ట్రంలోని మిగిలిన ఆలయాల పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ప్రశ్నలకు ఏజీ స్పందిస్తూ.. కమిటీ కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే చేస్తుందని తెలిపారు.

ఎవరినీ ఖాళీ చేయించటం, ఆక్రమించటం లేదని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. చట్టప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తోంని హైకోర్టుకు ఏసీ వివరించారు. అక్రమాలకు పాల్పడిన వారికి నోటీసులు ఇవ్వొచ్చని చెప్పినప్పటికీ ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కూడా నోటీసులు ఇచ్చి నివేదికలో ఆ అంశాలను కూడా పొందుపర్చాలని పేర్కొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా విచారణ కు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయ శాఖను కోరింది.

Tags:    

Similar News