రాత్రి కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకుంటారా?

Update: 2021-05-05 08:04 GMT

 తెలంగాణలో కరోనా నివారణకు చేపట్టిన చర్యలపై హైకోర్టు బుధవారం నాడు మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. 'రాష్ట్రంలో టెస్టులు సంఖ్య తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెపుతారు. టెస్టులు ఎందుకు పెంచడం లేదు.' అని ప్రశ్నించింది. రాష్ట్రంలో కావాల్సిన టెస్టులు చేస్తున్నామని కోర్టుకు వైద్య శాఖ తరపున హాజరైన శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఒక్క రోజు కూడా రాష్ట్రంలో లక్ష టెస్టులు దాటలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. నైట్ కర్ఫ్యూ పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించింది.

నైట్ కర్ఫ్యూ పెట్టినా కేసులు ఎందుకు పెరుగుతున్నాయని సందేహం వ్యక్తం చేసింది. లాక్ డౌన్ దిశ గా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ..వీకెండ్ లాక్ డౌన్ అంశంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్ డేటా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రం లో ఆక్సిజన్ ఎంత డిమాండ్ ఉందని ప్రశ్నించగా, 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను డిమాండ్ ఉందన్న శ్రీనివాస్ రావు. కేంద్ర ప్రభుత్వం 430 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇచ్చిందన్న డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు.. ఇప్పటికే పలు కర్ణాటక, ఒరిస్సా నుండి ఆక్సిజన్ తెచ్చామని కోర్టుకు నివేదించారు.

Tags:    

Similar News