తెలంగాణ సర్కారు మరోసారి కార్పొరేషన్ పదవుల భర్తీ చేపట్టింది. తాజాగా మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా మన్నె క్రిశాంక్ నియమితులయ్యారు.
తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ , ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ కు, తెలంగాణ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవివేద సాయిచందర్ కు దక్కాయి. రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికలు పూర్తయి సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కెసీఆర్ మరోసారి పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.