కానీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని తహ తహ లాడుతున్న కాంగ్రెస్ పార్టీ అందివచ్చిన మేడిగడ్డ ఫెయిల్యూర్ ఇష్యూ ను రాజకీయంగా సరిగా డీల్ చేయటం లేదు అని...ఈ విషయంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు అందరూ ఫెయిల్ అయ్యారు అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. కీలక నేతలు అందరూ బస్సు లో మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్లి ఉంటే పరిస్థితి ఒక రేంజ్ లో ఉండేది అని..కానీ తాము ఆరోపణలు చేసిన ప్రాజెక్టులో డొల్లతనం బయటపడినా దాన్ని వాడుకోవాల్సిన రీతిలో వాడుకోవటంలో విఫలం అయింది అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఒక వైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచ రికార్డులు నమోదు చేసింది అని ప్రభుత్వం చెప్పుకుంటుంటే...ఎన్నికల ముందు మేడిగడ్డలో బయటపడ్డ లోపాలను కాంగ్రెస్ పార్టీ ఇంత తేలిగ్గా తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి కాంగ్రెస్ దీనిపై ఫోకస్ పెట్టి ఉంటే రాజకీయంగా బిఆర్ఎస్ ఇరకాటంలో పడేది అని..కాంగ్రెస్ పార్టీ అందివచ్చిన అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోలేదు అనే చర్చ సాగుతోంది. టికెట్స్ ఖరారు హడావుడి లో ఉండి..ఈ విషయాన్ని వదిలేశారా లేక దీని వెనక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే చర్చ కూడా సాగుతోంది.
ఫ్రస్ట్రేషన్ క్లియర్ గా కనిపిస్తోంది వాళ్ళ మాటల్లో