ఇదేమి డిమాండ్

Update: 2024-10-03 08:16 GMT

పవర్ లో ఉన్న పదేళ్లలో కెసిఆర్ ఈ మాట చాలా సార్లు వాడారు. ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం. మా విధానాలే అమలు చేస్తాం తప్ప ...ప్రతిపక్షాలు చెప్పినట్లు నడుచుకునేది లేదు అంటూ తేల్చిచెప్పారు. తాము చేసేది తప్పు అయితే ప్రజలు తీర్పు ఇస్తారు తప్ప..కాంగ్రెస్ పార్టీ నో...మరొకరో చెపితే తాము వినాల్సిన అవసరం లేదు అంటూ కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించారు. అసెంబ్లీ లో కూడా కెసిఆర్ ఇదే మాట చెప్పారు. కెసిఆర్ చెప్పినట్లే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు లు సెక్రటరియేట్ కు వచ్చి మూసి విషయంలో పేదలను ఎలా న్యాయం చేయాలో చెపితే సంతోషిస్తామని...దీనిపై అఖిలపక్షం ఏర్పాటుకు రెడీ గా ఉన్నట్లు కూడా ప్రకటించారు. రాజకీయంగా కొంత నష్టం ఉన్నా భవిష్యత్ తరాల కోసం తాము ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు తెలిపారు.

                                           ఇంతవరకు బాగానే ఉంది కానీ...కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి , కె వీ పీ రామ చంద్ర రావు లకు అక్రమ ఫార్మ్ హౌస్ లు ఉన్నాయని...వీటిని కూల్చాలా వద్ద అంటూ రేవంత్ రెడ్డి బహిరంగ సభ వేదిక నుంచి ప్రశ్నించటం విచిత్రం ఉంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రే వాటిని అక్రమ ఫార్మ్ హౌసులు అని చెపుతున్నప్పుడు...వాటిని కూల్చటానికి అక్రమంగా కట్టిన వాళ్ళ అనుమతి తీసుకుంటారా?. అది కూడా సీఎం బహిరంగంగా ఎవరైతే అక్రమంగా కట్టారు అని చెపుతున్నారో వాళ్ళ అనుమతి కోరటం ఏమిటి అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలు కొట్టేసిన ప్రభుత్వం వీళ్ళవి అక్రమ నిర్మాణాలు అని తెలిసి కూడా కూల్చకుండా..ఇంకా దానికి వాళ్ళ పర్మిషన్ అడగటం ఏమిటో అన్న చర్చ తెరమీదకు వస్తోంది.

Tags:    

Similar News