లాక్ డౌన్ పై నిర్ణయం..తెలంగాణ కేబినెట్ 30న

Update: 2021-05-26 08:24 GMT

తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే కేసులు గణనీయంగా తగ్గుతున్నందున మరికొన్ని రోజులు కొనసాగిస్తేనే మంచిదనే అభిప్రాయం కొంత మంది వ్యక్తం చేస్తుండగా...లాక్ డౌన్ వల్ల రోజువారీ కూలీలతోపాటు చిరు వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుందనే లెక్కలు మరో వైపు. ఈ తరుణంలో ఈ నెల 30 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

రాష్ట్రంలో వ్యవసాయం, పంటలు, కొనసాగుతున్న ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం, కరోనా, లాక్ డౌన్ తదితర అంశాలమీద క్యాబినెట్ చర్చించనున్నది. లాక్ డౌన్ చివరి రోజున మంత్రివర్గ సమావేశం పెట్టడంతో ఎలాంటి నిర్ణయం వస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News