పెగ్ డౌన్ చేస్తే...తెలంగాణ సర్కారు నడవదు

Update: 2023-02-22 05:22 GMT

‘పెన్ డౌన్ చేస్తే తెలంగాణ వచ్చింది అన్నది వాస్తవమే.ఈ రోజు నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వం రేపు మనం కనక..మన సోదరులు సాయంత్రం పూట ఏదో టైం పాస్ కో ...ఉల్లాసానికో తీసుకుంటున్న పెగ్ కనుక పక్కన పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి నడవదు . ఇది వాస్తవం. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ నడుస్తుంది అంటే లిక్కర్ మీద. లిక్కర్ స్కామ్ మీద...లిక్కర్ మీద వచ్చే డబ్బుల మీదే . రేపు కనుక ప్రజలు ఒక ఆరునెలలు తెలంగాణ ప్రభుత్వాన్ని స్తంభింభ చేయాలనుకుంటే మాత్రం ప్రజల చేతుల్లో ఉంది.

                           ఆరు నెలలు పెగ్ పక్కన పెడితే..పెగ్ డౌన్ చేసిన రోజు ఈ తెలంగాణ ప్రభుత్వం అసలు నడవదు. ’ ఇది ఒక బీజేపీ నాయకుడు ఆ పార్టీ నిర్వహిస్తున్న కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ చేసిన వ్యాఖలు. దీనికి సంబదించిన వీడియో ఒకటి ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత లిక్కర్ ఆదాయం గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. ఒక్క గత ఏడాదిలో అంటే 2022 జనవరి నుంచి డిసెంబర్ కాలంలోనే ప్రభుత్వానికి లిక్కర్ అమ్మకాల ద్వారా 34 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.

Tags:    

Similar News