ఇది నిజమేనా !

Update: 2024-08-16 12:31 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ కీలక నేతలకు పదవులు పంచేసారు. తెలంగాణ సీఎం అది కూడా నిత్యం విమర్శలు ఎక్కుపెట్టే బిఆర్ఎస్ నేతలకు పదవులు పంచటం ఏమిటి అన్నదే కదా మీ డౌట్. నిజమే. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అదే పని చేశారు. బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు గవర్నర్ పదవి, మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావు కు తెలంగాణ లో ప్రతిపక్ష నేత హోదా రాబోతున్నట్లు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లో మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఆయన ఈ విషయాలు చెప్పారు.. వాళ్లకు ఈ పదవులు ఎందుకు వస్తాయో కూడా చెప్పారు. బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం తథ్యం అని మరో సారి తేల్చిచెప్పారు. బిఆర్ఎస్ నేతలు బీజేపీ లో పార్టీ విలీనం వార్తలను ఇప్పుడు ఖండించినా కూడా జరిగేది మాత్రం అదే అన్నారు.

                                                             బిఆర్ఎస్ కు ఉన్న రాజ్య సభ సభ్యులను బీజేపీ లో విలీనం చేయటం ద్వారా కవిత కు బెయిల్ వస్తుంది అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవలే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ లో బిఆర్ఎస్ విలీన వార్తలను తీవ్రంగా ఖండించారు. దుష్ప్రచారం చేసే వాళ్లపై లీగల్ గా యాక్షన్ కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు మరో సారి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఈ విషయాన్ని బీజేపీ లో బిఆర్ఎస్ విలీన అంశాన్ని ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇదే తరహాలో స్పందించారు. కవిత బెయిల్ కు బీజేపీ కి సంబంధం ఏమిటి అన్నారు. కెసిఆర్ కి ఏఐసిసి , కేటీఆర్ కు పీసిసి, కవిత కు కాంగ్రెస్ నుంచి రాజ్య సభ సీట్ ఖాయం అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సంజయ్. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకే గతంలో పొత్తులు పెట్టుకుని..పదవులు పంచుకున్న చరిత్ర ఉంది అన్నారు. 

Tags:    

Similar News