కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రెండవ రోజు పాదయాత్ర కొనసాగుతోంది. ఈ రెండో రోజు రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర. ఉప్పునూతల, గట్టుకాడి పల్లి, కామ్సనూపల్లి, తిరుమలపూర్, డిండి మీదుగా చింతపల్లి వరకు సాగనుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గట్టుకాడి పల్లి వద్ద పొలాల్లో పని చేసుకుంటున్న ఆడబిడ్డలతో ముచ్చటించారు. కేసీఆర్ ఇచ్చే రైతుబంధుతో ఉపయోగం లేదు. ఎరువుల ధరలు పెరిగిపోయాయి, అన్నీ సరుకుల ధరలు బాగా పెరిగిపోయినయ్.... కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్టుంది అని రేవంత్ రెడ్డి వద్ద మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
కామ్సనూపల్లి వద్ద ఇటుకబట్టీల్లో పని చేసుకుంటున్న ఆడబిడ్డలతో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. అభయ హస్తం డబ్బు కట్టించుకున్నారు... తిరిగి ఇవ్వలేదని మహిళలు ఫిర్యాదు చేశారు. ఓట్ల కోసం రాలేదు...మీ కష్టాలు తెలుసుకునేందుకు వచ్చానని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మీ బతుకులెట్ల బాగుచేయాల్నో అర్థం చేసుకునేందుకు ఈ పర్యటన అన్నారు.