కానీ రెండు సార్లు ఓటమి పాలు అయిన రాష్ట్రంలో పీసి సి కమిటీ పదవులతో పెద్దగా ఒరిగేది ఏమి ఉండదని సీనియర్లు అంతా ఒక పథకం ప్రకారమే రచ్చ చేస్తున్నారు అనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రకటన చేయటంతో రేవంత్ రెడ్డి అంతా సైలంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారు అనే చర్చ సాగుతోంది. జనవరి 26 నుంచి మొదలు పెట్టి ..జూన్ 2 వరకు పాదయాత్ర సాగనుంది. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇమేజ్ ను పెంచటంతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా లాభం చేస్తుంది అనే అభిప్రాయం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో సీనియర్ నేతలు రాబోయే రోజుల్లో ఇంకా ఎంత హంగామా చేస్తారు...పార్టీ కి నష్టం చేసే పనులు ఇలాగే కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు కీలకం కాబోతోంది. ఎవరు ఉన్నా లేక పోయినా అన్న చందంగా రేవంత్ రెడ్డి మాత్రం తన టార్గెట్ తాను రీచ్ అయ్యేందుకు కావాల్సిన పనిలో ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి పాదయాత్ర తో అయినా కాంగ్రెస్ పార్టీ ఫేట్ మారుతుందా అన్నది వేచిచూడాల్సిందే. కాంగ్రెస్ లో తాజా రచ్చను వాడుకుని ఆ పార్టీ నేతలపై బీజేపీ వల విసురుతోంది. ఇది వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది కొద్దికాలం పోతే కానీ తెలియదు.