మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ నెల 8న నల్లగొండలో భారీ సభ నిర్వహించి బిఎస్సీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉండటంతో హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ప్రవీణ్‌కుమార్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన్ను ఇంటికి పంపించే అవకాశం ఉందని సమాచారం. ప్రవీణ్ కుమార్ బిఎస్పీలో చేరిక సందర్భంగా చేసిన విమర్శలపై అధికార టీఆర్ఎస్ ఆయనపై పూర్తి స్థాయిలో ఎటాక్ ప్రారంభించింది.