కొత్త వాళ్లకు రాకుండా రేవంత్ రెడ్డి పై దుష్ప్రచారం

Update: 2024-09-17 05:39 GMT

హైదరాబాద్ లో పని చేస్తున్న జర్నలిస్ట్ ల రెండు దశాబ్దాల పెండింగ్ కల నెరవేర్చటంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అంతే కాదు...ఇంకా పెండింగ్ లో ఉన్న హైదరాబాద్ జర్నలిస్టులకు కూడా ఫోర్త్ సిటీ లో చోటు కలిపిస్తామని జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ కి పేట్ బషీరాబాద్ స్థలం అప్పగిస్తూ విస్పష్టమైన అధికారిక ప్రకటన చేశారు. అంటే హైదరాబాద్ కేంద్రంగా పని చేసే అర్హులు అయిన జర్నలిస్ట్ లు అందరికి న్యాయం చేస్తామని అధికారికంగానే ప్రకటించారు. ఇందులో ఎలాంటి రహస్యం లేదు...తెర వెనక వ్యవహారాలు ఏమి లేవు. కానీ జర్నలిస్ట్ లు అందరికి సీఎం రేవంత్ రెడ్డి...కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తే ఎక్కడ వాళ్లకు మంచి పేరు వస్తుందో అనే ఉద్దేశంతో రంగంలోకి కొంత మంది పింక్ బాలు లు రంగంలోకి దిగారు. ఆ ట్విట్టర్ అకౌంట్స్ ..అందులో పోస్ట్ లు చూస్తే ఇది ఎవరి కోసం పని చేస్తుందో అర్ధం అవుతోంది. అందుకే తెలంగాణ సర్కారుపై..ముఖ్యంగా రేవంత్ రెడ్డి పై ఇదే వేదికగా జర్నలిస్ట్ ల విషయంలో తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో జవహర్ లాల్ హాసింగ్ సొసైటీ స్థలం కేటాయించారు. అది కూడా జర్నలిస్ట్ లు కోట్ల రూపాయలు పెట్టి మార్కెట్ ప్రకారమే ఈ భూమి కొనుగోలు చేసుకున్నారు.

                                                         గతంలో కూడా హైదరాబాద్ లో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే..ఇప్పుడు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ ఇప్పడు మాత్రం పింక్ బాలులు ఒక్కోఆంధ్రా జర్నలిస్టుకి 100 కోట్ల రూపాయల లాండ్ ఇచ్చారు అంటూ తప్పుడు ప్రచారం తెర మీదకు తెచ్చారు. మరి నిజంగా తెలంగాణ జర్నలిస్ట్ లపై కెసిఆర్ కు..కేటీఆర్ కు, హరీష్ రావు కు ఏ మాత్రం ప్రేమ ఉన్న కనీసం ఆంధ్ర వాళ్ళను పక్కన పెట్టి ఆయినా గత పదేళ్ల కాలం లో తెలంగాణ జర్నలిస్ట్ లకు ఆయినా స్థలాలు ఇచ్చి ఉండాలి కదా. కానీ అలా చేయలేదు. ఈ స్థలాలు ఇచ్చింది..ఉమ్మడి రాష్ట్రంలో. బిఆర్ఎస్ ఓటమి పాలు కావటాన్ని తట్టుకోలేక పోతున్న కొంత మంది మరో సారి సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని బతకడానికి కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చావు అంటూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మరి అయన బిఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పుడు కెసిఆర్ కు ఆ విషయం తెలియదా?. బిఆర్ఎస్ కు..ఆ పార్టీ నేతలకు అవసరం వచ్చినప్పుడు ఆంధ్రా ప్రాంతం..ఆ ప్రాంత ఓటర్లు కావాలి. కానీ రాజకీయ అవసరాల కోసం మాత్రం ఆ బూచి ని చూపించి లబ్ధిపొందాలని ఎత్తుగడలు వేయటం. అయితే ఈ విషయాన్ని ఇప్పటికే తెలంగాణా ప్రజలు గమనించారు.

                                                                                     స్వయంగా వేస్తున్న ఎత్తుగడలు ఏమి ఫలించకపోవటం తో ఇప్పుడు కొంత మంది సోషల్ మీడియా సైన్యాన్ని రంగంలోకి దించి హౌసింగ్ సైట్స్ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ వరకో ఎందుకో కెసిఆర్ ఫ్యామిలీ పత్రిక..టీవీల్లో పని చేస్తున్న వాళ్ళు కూడా ఈ సొసైటీ లో ఉన్నారు కదా. నిజాలు ఏంటో వాళ్ళను అడిగితే చెప్పారా. దుష్ప్రచారం చేసే వాళ్లకు కావాల్సింది నిజాలు కాదు..కేవలం జర్నలిస్టులకు మంచి చేస్తున్న వాళ్లపై దుష్ప్రచారం చేసి పబ్బం గడుపుకోవటమే. సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చిన తర్వాత కూడా జర్నలిస్ట్ లకు అంటే..పాత కొత్త జర్నలిస్ట్ లు అందరికి మేలు చేసే అవకాశం ఉన్నా కూడా అటు కెసిఆర్ కానీ..ఇటు కేటీఆర్ కానీ ఆ పని చేయలేదు. ఇప్పుడు ఈ విషయాల్లో క్రెడిట్ రేవంత్ రెడ్డి కి వస్తుండటంతో బిఆర్ఎస్ కు దిక్కుతోచడం లేదు. అందుకే కొంత మందికి రంగంలోకి దించి దుష్ప్రచారం చేయించుతోంది. ఇలా చేస్తే ఎందుకొచ్చిన గొడవ అని సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ఇచ్చేవాళ్లు విషయాన్ని పెండింగ్ లో పెడితే దీని ద్వారా రాజకీయ లబ్దిపొందాలన్నది ఆ పార్టీ ఆలోచనగా ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఉన్నవి లేనివి కలిపి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.

Tags:    

Similar News