పవన్ కళ్యాణ్ పొత్తుల ఓపెన్ ఆఫర్ వెనక కథ ఏంటి?!

Update: 2023-01-24 16:43 GMT

Full Viewజన సేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం రూట్ మారినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే మంగళవారం నాడు అయన చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. ఈ సారి జనసేన ఖచ్చితంగా తెలంగాణ బరిలో నిలుస్తుంది అని ప్రకటించటమే కాకుండా...ప్రతి నియోజక వర్గంలో తమకు ఉండే వెయ్యి నుంచి రెండు వేల ఓట్లను కూడా ఒకే పార్టీ కి వేయించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని..పది ఓట్లు ఉంటేనే వంగి వంగి దండాలు పెడతారు ...ఇన్ని ఓట్లు ఉన్న తాము ఈ పరిస్థితి ని ఉపయోగించుకోవాలి అనే తరహాలో పవన్ తెలంగాణ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతం జనసేన ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ తో పొత్తులో కొనసాగుతోంది. కానీ బీజేపీ మాత్రం అధికార వైసీపీ విషయంలో చాలా సాఫ్ట్ కార్నర్ తో ఉందనే అభిప్రాయం అటు ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ నేతలతో పాటు జనసేనలో కూడా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ పదే పదే ప్రకటిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ తో కలిసి ముందుకు సాగటానికి సిద్ధంగా లేదు. అదే సమయంలో తెలంగాలో కూడా బీజేపీ ఒంటరిగానే వెళతామని ప్రకటిస్తోంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ వ్యాఖలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి త్రిముఖ పోటీ ఖాయం. చాలా పార్టీల బరిలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం మూడు పార్టీల మద్యే ఉంటుంది. సీఎం కెసిఆర్ ఎప్పుడైతే టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మర్చి దేశవ్యాప్త పోటీకి నిర్ణయం తీసుకున్నారో అప్పుడే చంద్రబాబు కూడా తెలంగాణాలో టీడీపీ కార్యక్రమాల జోరు పెంచింది.

ఏపీలో పొత్తు పెట్టుకున్న తరహాలోనే తెలంగాణాలో కూడా టీడీపీ, జనసేన కలిస్తే రాజకీయం కొత్త మలుపులు తిరగటం ఖాయం.వీళ్లకు బీజేపీ కూడా జత కలిస్తే అది పెద్ద సంచలనమే అవుతుంది. అటు ఆంధ్ర లో అయినా..ఇటు తెలంగాణాలో అయినా ఎవరు కలిసి వస్తే వాళ్ళతో కలిసి సాగుతామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పొత్తు ఎవరితో పెట్టుకున్నా కానీ...జీహెచ్ఎంసీ ఎన్నికలలాగా వదలం. ఈ సారి పక్కా. రాజకీయ పదవుల్లో కూడా వాటా కోరతాం అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణపై బీజేపీ సీరియస్ గా దృష్టి పెట్టిన సమయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన మద్దతు బీజేపీకే ఉంటుంది అని ప్రకటిస్తూనే ఓట్లను ఒకే పార్టీ కు గంపగుత్తగా బదిలీ చేస్తామని ప్రకటించటం కీలకంగా మారింది. జనసేన సొంతంగా ఎన్ని సీట్లు గెలవగలదు అంటే చెప్పటం కష్టమే కానీ...ఆ పార్టీ బరిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా గెలుపు అవకాశాలను దెబ్బతీయగలదు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ప్రతి నియోజకవర్గంలో జనసేనకు వెయ్యి నుంచి రెండు వేల ఓట్లు గ్యారంటీగా ఉంటాయి. ఇవి చాలు గెలుపు..ఓటములను డిసైడ్ చేయటానికి. చూడాలి రాబోయే రోజులల్లో పవన్ కళ్యాణ్ ప్రకటన ప్రభావం ఎలా ఉంటుందో. చివరి వరకు చూసి బీజేపీ పొత్తుకు రెడీ కాకపోతే తెలంగాణ లో టీడీపీ, జనసేనలు బిఆర్ఎస్ తో కలిసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదనే చర్చ సాగుతోంది. ఎందుకంటే తెలంగాలో ముఖ్యంగా హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రాంత ఓట్లు బిఆర్ఎస్ కు ఎంతో కీలకం అనే విషయం తెలిసిందే. 

Tags:    

Similar News