ముఖ్యమంత్రి కెసీఆర్ లాక్ డౌన్ అంశంపై కుండబద్ధలు కొట్టారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు. గత ఏడాది విధించిన లాక్ డౌన్ వల్ల ఆర్ధికంగా చాలా నష్టపోయామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. మాస్క్ లు ధరించి, భౌతికదూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే చాలన్నారు. స్కూళ్ళ మూసివేత కూడా తాత్కాలికమే అన్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఇటీవలే స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి లాక్ డౌన్ పై రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తుండటంతో సీఎం కెసీఆర్ దీనిపై స్పష్టత ఇచ్చారు. పలు రాష్ట్రాలు మాత్రం నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్న వారిని తమ దగ్గరకు అనుమతిస్తామని ప్రకటిస్తున్నాయి.