అమలుకు నోచుకోని వంద రోజుల హామీ

Update: 2024-11-12 06:18 GMT

వంద రోజుల్లోనే పాత పద్ధతి అమల్లోకి తెస్తాం. మీడియా సచివాలయంలోకి ఎప్పటిలాగానే వెళ్లొచ్చు. బిఆర్ఎస్ ప్రభుత్వం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. మీడియా తో పాటు అందరికి తమ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుంది అని బాధ్యతలు చేప్పట్టిన తోలి రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు మార్లు ప్రకటించారు. వంద రోజులు అయిపోయింది..త్వరలోనే 365 రోజులు కూడా పూర్తి కాబోతున్నాయి. కానీ ఇప్పటివరకు సచివాలయంలోకి మీడియా కు ఎంట్రీ లేదు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా పాత సచివాలయం ఉన్నంత కాలం రాష్ట్ర పరిపాలన కేంద్రం అయిన సచివాలయంలోకి మీడియా ప్రతినిధులను అక్రిడేషన్ చూపిస్తే చాలు అనుమంతిచేవారు. కానీ ఎప్పుడైతే సచివాలయం బిఆర్ కె భవన్ కు మార్చారో అప్పటి నుంచి అక్కడ అసలు స్థలం లేదు అని చెప్పి మీడియా ఎంట్రీ కి బ్రేక్ లు వేసింది అప్పటి కెసిఆర్ సర్కారు. పోనీ కెసిఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా అద్భుతంగా కట్టినట్లు చెప్పిన కొత్త సచివాలయం ప్రారంభం అయిన తర్వాత మార్పు వచ్చిందా అంటే అదీ లేదు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు బిఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్న సమయంలో మీడియా తో ఎలా వ్యవహరించారో ఎన్నో సార్లు లైవ్ ల సాక్షిగా ప్రజలు చూశారు. తాము బిఆర్ఎస్ బాటలో వెళ్ళం అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు మీడియా ను సచివాలయంలోకి ఎంట్రీ కలిపించే విషయంలో మాత్రం కెసిఆర్ బాటలోనే పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.

                                                          గతంలో అయినా..ఇప్పుడైనా కూడా ప్రధాన మీడియా లో పని చేసే వాళ్ళు ఎవరైనా ఒక మంత్రి, ఐఏఎస్ అధికారి దగ్గరకు వెళ్లాలంటే వాళ్ళ ముందస్తు అనుమతి తీసుకొని కానీ వెళ్ళరు. నేరుగా వెళ్లినా కూడా వాళ్ళ అనుమతి ఉంటే తప్ప ఛాంబర్ లోకి ఎవరిని అనుమతించారు. ప్రస్తుతం సచివాలయంలోకి సీఎం ...లేదా ఇతర మంత్రుల మీడియా సమావేశాలు ఉంటేనే మీడియా ని అనుమతిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే ఆంధ్ర ప్రదేశ్ లో గత జగన్ ప్రభుత్వం తో పాటు చంద్రబాబు ఫస్ట్ టర్మ్ లోనూ...ఇప్పుడు రెండవ టర్మ్ లోనూ జర్నలిస్టులకు సచివాలయ ఎంట్రీ పై ఎలాంటి ఆంక్షలు లేవు. ఎప్పటిలాగానే అక్రిడేషన్ ఉన్న వాళ్ళు అందరిని అనుమతిస్తున్నారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాక ముందు హామీ ఇచ్చిన మేరకు గత పదిహేను సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న...కెసిఆర్, కేటీఆర్ మాటలు చెప్పి మోసం చేసిన హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల సమస్యను రేవంత్ రెడ్డి పరిష్కరించారు. అయితే పెండింగ్ లో ఉన్న జర్నలిస్ట్ లకు ఫోర్త్ సిటీ లో అవకాశం ఇస్తామని స్వయంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి..ఇప్పుడు రెండవసారి గెలిచాక చూస్తాం అని ప్రకటించటంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రకటనపై జర్నలిస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News