తెలంగాణ కాంగ్రెస్ లో భవిష్యత్ పై ధీమా ఇచ్చే నాయకులు కన్పించటం లేదు. దీంతో పలువురు నేతలు ప్రత్యామ్నాయలు వెతుక్కునే పనిలో పడ్డారు. కాంగ్రెస్ లోని సీనియర్లు మాత్రం అంతర్గత పోరాటాలతో బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ మల్కాజీగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. శ్రీశైలం గౌడ్ ప్రస్తుతం మేడ్చల్ డీసీసీ ప్రెసిడెంట్ గా కూడ ఉన్నారు. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు ఆయన ఆదివారం నాడు ప్రకటించారు.
పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఆరేళ్లుగా కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు తనను బాధించాయని, ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల సమస్యలపై పోరాటంలో పార్టీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చెందారు.