సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే ఆయనపై ఐటి, ఈడీ దాడులు చేయించారని తెలంగాణ మంత్రి కెటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే తమకు ఎక్కడ ఇబ్బంది అవుతుందనో ఇలాంటి పనులు చేస్తారన్నారు. సేవా కార్యక్రమాలు మొదలుపెడితే పేరు కోసం చేస్తున్నారని..దీని వెనక ఏదో కారణం ఉందని అంటారు. అది కూడా విపలం అయిన తర్వత క్యారెక్టర్ ను దెబ్బతీయాలని చూస్తారన్నారు. ఈ విషయం ఆయనకూ తెలుసన్నారు. ఐటి, ఈడీ దాడులతో భయపెట్టే ప్రయత్నం చేస్తారన్నారు. ఇలాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదని..తాము అండగా ఉంటామన్నారు. మీరు రియల్ హీరో అని..ఇలాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదన్నారు.
హెచ్ ఐసీసీలో జరిగిన కోవిడ్ వారియర్స్ సమావేశంలో పాల్గొన్న కెటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో సోనూసూద్ మాట్లాడుతూ కేటీఆర్ లాంటి నాయకుడు ఉంటే నాలాంటి వాళ్ళ అవసరం ఎక్కువగా ఉండదన్నారు. కోవిడ్ వల్ల ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్లకు సహాపడటమే ఇక మన ముందున్న సవాలు అని పేర్కొన్నారు. జమ్మూ నుండి కన్యాకుమారి వరకు నేను సహాయ కార్యక్రమాలు చేసినా.. ఒక్క తెలంగాణ నుండే సమాంతరంగా ప్రతిస్పందించే వ్యవస్థ తనకు తారసపడిందని తెలిపారు.