ఆ పార్టీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిందే నిజం అయితే లిక్కర్ స్కాములో మేనేజ్ చేసిన కెసిఆర్ ...కేసు లు తన వరకు...తన కొడుకు వరకు వస్తే మేనేజ్ చేసుకోలేరా అని అయన ప్రశ్నించారు. అసలు రాజగోపాల్ రెడ్డి ఇవన్నీ ఎలా మాట్లాడారో ..ఎలా మాట్లాడనించారో అని మరో సీనియర్ నేత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇవి అన్నీ కూడా బీజేపీ పరువు తీసేలా ఉన్నాయనే చర్చ ఆ పార్టీ నేతల్లో సాగుతోంది. కొద్దినెలల క్రితం జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ క్యాంపెనర్, ఎంపీ కోమటిరెడ్డి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవదు అని...డబ్బులు ఎవరు ఖర్చు పెడతారు అంటూ ప్రశ్నించారు. తనకు పీసిసి ప్రెసిడెంట్ పదవి ఇస్తే పాదయాత్ర చేద్దామనుకున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పటిలో . సీన్ కట్ చేస్తే మునుగోడులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలు కావటంతో ఆయన కూడా తర్వాత సైలెంట్ అయిపోయారు. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే తర్వాత వెంకటరెడ్డి కూడా బీజేపీ లోకి వెళతారు అని అప్పటిలో బలంగా ప్రచారం జరిగింది. కానీ అక్కడ లెక్కలు అన్నీ తప్పాయి...కర్ణాటకలో కాంగ్రెస్ గెలవటంతో పరిస్థి తి మరింత మారిపోయింది. అటు కాంగ్రెస్ లో ఉండి వెంకట రెడ్డి...ఇటు బీజేపీ లో ఉండి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీలను ఇరకాటంలోకి నెట్టడంతో బ్రదర్స్ ఎప్పుడూ ఇంతేనా అన్న చర్చ సాగుతోంది రాజకీయ వర్గాల్లో.