హామీని అమలు చేసిన సీఎం

Update: 2024-09-07 12:43 GMT

మాటలతో కూడా కడుపు నిండేలా చేయగల సామర్థ్యం ఎవరికైనా ఉంది అంటే అది బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు మాత్రమే సాధ్యం అవుతుంది అని చెప్పాలి. ఇలా మాటలు చెప్పుకుంటూ పోయి...అసలు పని చేయకపోతే ఆ మోసం ఎప్పటికైనా బయటపడుతుంది. దానికి కాస్త సమయం ఎక్కువ పట్టొచ్చు. అయితే ఇంత దారుణంగా మోసపోయిన వాళ్ళు మరో సారి అటు కెసిఆర్..ఇటు కేటీఆర్ ను నమ్ముతారా అన్నది వేచిచూడాల్సిందే. హైదరాబాద్ లో గత కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు చోట్ల కలిపి 70 ఎకరాల స్థలం కేటాయించారు. అయితే తర్వాత అది కోర్ట్ కేసుల్లో చిక్కుకుంది. సుప్రీం కోర్ట్ లో కేస్ పరిష్కారం అయితే చాలు...వెంటనే జర్నలిస్ట్ లకు స్థలాలు ఇస్తామని...హైదరాబాద్ లో అసలు భూమికి కొదవలేదు అంటూ కెసిఆర్ పలు మార్లు ప్రకటించారు. ఒక మాటలో చెప్పాలంటే పదేళ్లు జర్నలిస్ట్ లకు రంగుల ప్రపంచం చూపించారు అనే చెప్పాలి.

                                                  గతంలో భూమి కేటాయించిన వాళ్ళకే కాకుండా...గత రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న జర్నలిస్ట్ లకు కూడా కొత్త గా కూడా స్థలాలు కేటాయిస్తామని చెప్పుకొచ్చారు. కెసిఆర్ సీఎం గా ఉన్న సమయంలోనే సుప్రీం కోర్ట్ లో కేసు క్లియర్ అయింది. కేసు క్లియర్ కు అవసరం అయిన సహకారం మాత్రం అప్పటి ప్రభుత్వం అందించింది. కానీ అసలు కీలకం అయిన భూమి అప్పగింత విషయంలో వెయ్యికి పైగా ఉన్న జర్నలిస్టులకు మాత్రం కెసిఆర్, కేటీఆర్ లు చుక్కలు చూపించారు. అసలు ఈ విషయంపై మాట్లాడానికి కెసిఆర్ దగ్గర దగ్గర ఏడాది పాటు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. ఇదేదే జర్నలిస్ట్ ల వ్యక్తగత వ్యవహారం కాదు. ఈ సొసైటీ లో అన్ని ప్రధాన పత్రికలతో పాటు అన్ని టీవీల్లో పనిచేసిన జర్నలిస్ట్ లు కూడా ఉన్నారు. సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చిన వెంటనే కేటీఆర్ ట్వీట్ చేస్తూ తమ దీర్ఘకాలిక పెండింగ్ హామీ అమలుకు మార్గం సుగమం అయింది అని ట్వీట్ చేశారు.

                               కానీ తర్వాత మాత్రం అయన ఈ విషయంలో డబుల్ గేమ్ ఆడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది...ప్రతిపక్షంలో ఉండగా హామీ ఇచ్చిన మేరకు..అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తన హామీని అమలు చేశారు. ఇప్పటికే జరలిస్ట్ హౌసింగ్ సొసైటీ కి ఇవ్వాల్సిన పేట్ బషీరాబాద్ భూమికి సంబందించిన ఫైల్ పై సంతకం చేశారు. దీనికి సంబదించిన మెమో ను ఆదివారం నాడు రేవంత్ రెడ్డి సొసైటీ కి అందించనున్నారు. దీంతో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దగ్గర దగ్గర 1100 మంది జర్నలిస్ట్ ల కల నెరవేరబోతోంది. సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న కేసు పరిష్కారం సమయంలో అప్పటి సిజెఐ ఎన్ వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి తక్కువ జీతాలతో పనిచేసే జర్నలిస్టులకు...ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ లతో కలిపి చూడటం లేదని..అందుకే ఈ కేసు ను సెపరేట్ చేసి మరి తీర్పు ఇచ్చారు. 

Tags:    

Similar News