ప్రాంతీయవాదికి ఉప ప్రాంతీయవాది షాక్

Update: 2023-12-03 15:46 GMT

ఇటీవలే వచ్చిన నందమూరి బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరి సినిమాలో ఒక డైలాగు ఉంటది. అది ఏంటి అంటే ఈ పేరు చానా ఏళ్ళు యాదుంటది. సరిగ్గా ఇప్పుడు ఈ డైలాగు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే గా గెలిచిన కాటిపల్లి వెంకటరమణా రెడ్డి కి పక్కాగా సెట్ అవుతుంది అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక్క దెబ్బతో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ను, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ని ఓడించి తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించారు అనే చెప్పాలి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ప్రాంతీయవాదంతో పార్టీ పెట్టి...పదేళ్లు అధికారంలో ఉన్న కెసిఆర్ ను..కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఉప ప్రాంతీయవాదం అంటే...కామారెడ్డి కి తానే లోకల్ అని...అటు సీఎం కెసిఆర్...ఇటు రేవంత్ రెడ్డి గెలిచినా వాళ్ళు ఇక్కడ ఉండరు అంటూ ప్రచారం చేసి విజయం సాధించారు. ఈ విషయం ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్ళింది అనటానికి ఉదాహరణ ఎన్నికల ప్రచార సమయంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిపై పలు మార్లు వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది.

                                     Full Viewరాష్ట్రం సాధించిన కెసిఆర్ కు తెలంగాణ అంతా లోకలే అంటూ పలు మార్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు. కానీ ఇవేమి పని చేయలేదు అని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. లోకల్ వాదాన్ని తెరపైకి తేవటంతో పాటు చాలా ముందు నుంచి కూడా కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలో పనిచేసుకుంటూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో ఆయన ఏకంగా ఇద్దరు కీలక నేతలు కెసిఆర్, రేవంత్ రెడ్డి లను ఓడించి విజయం సాధించారు. కామారెడ్డి లో కెసిఆర్ రెండవ స్థానంలో ఉండగా..రేవంత్ రెడ్డి మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తొలుత చాలా రౌండ్ల లో రేవంత్ రెడ్డి లీడ్ లో ఉండటంతో..ఒక దశలో కెసిఆర్ మూడవ స్థానానికి వెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి.

Tags:    

Similar News