తొలి వెలుగుకు చెందిన జర్నలిస్టు రఘను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. గుర్రంపోడు తండా గిరిజన భూముల అంశానికి సంబంధించిన కేసులో రఘును అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనపై ఎఫ్ ఐఆర్ నమోదు అయింది. ఫిబ్రవరిలో ఎప్ ఐఆర్ నమోదు కాగా..ఆయన్ను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. రఘ అరెస్ట్ ను జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. పలు రాజకీయ పార్టీలు కూడా ఈ అరెస్ట్ ను తప్పుపట్టాయి. దీనిపై బీజేపీ తెలంగాన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ రఘు అరెస్టు ను ఖండిస్తున్నామన్నారు. సమాజం లో ప్రభుత్వ లోపాలని ఎత్తి చూపితే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. హుజూర్ నగర్ నియోజకవర్గం గుర్రంపోడు తండా గిరిజన భూముల్ని అధికార పార్టీ నేతలు ఆక్రమిస్తే ఆ కబ్జా భాగోతాన్ని మీడియాలో కవర్ చేసినందుకు ఆయన పై కేసు పెట్టారని తెలిసింది. ప్రజా స్వామ్యం లో అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తడమే మీడియా బాధ్యత.అక్రమ కేసులతో మీడియా గొంతు ను మూయించాలని ఈ ప్రభుత్వం అనుకుంటోంది.
రాష్ట్రం లో రాక్షస పాలన నడుస్తోంది. అక్రమ కేసులతో మీడియా హొంతు నొక్కాలని ప్రభుత్వం చూస్తోంది.అధికార పార్టీ నేతల కబ్జాలపై వార్తలు రాస్తే కేసులు పెడుతామన్న సంకేతాలను కేసీఆర్ సర్కార్ ఇస్తోంది. వాస్తవాలను రాసె జర్నలిస్టుల పై కేసులు పెడితే జైళ్లన్నీ రిపోర్టర్లతో నిండిపోతాయి... దానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ప్రజా స్వామ్యానికి 4 వ పిల్లర్ అయిన మీడియా ప్రతినిధుల పై ఈ అమానుష చర్య లేంటి అని ప్రశ్నించారు. ఈ రోజు రఘు కు జరిగినదే రేపు మరో జర్న లిస్టుకు జరగొచ్చు. తెలంగాణా సాధనలో జర్నలిస్టుల పాత్ర కూడా ఎంతో ఉంది. ఆటలాంటిది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుకుని 24 గంటలు గడవక ముందే ఒక సీనియర్ జర్నలిస్ట్ ను కిడ్నాప్ తరహా లో అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు.