ధరణిపై నడ్డా దో మాట...బండి దో మాట

Update: 2023-06-25 14:58 GMT

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకంగా మారిన ధరణి పోర్టల్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడిది ఒక మాట...తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిది మరో మాట. కొద్ది రోజుల క్రితమే బండి సంజయ్ తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేయం..అందులో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలిపేస్తామని చెపుతోంది. ఆదివారం నాడు నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ నవ సంకల్ప సభలో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మాత్రం బండి సంజయ్ కి ఝలక్ ఇచ్చేలా తాము అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తాం అని ప్రకటించటం కీలకంగా మారింది. అత్యంత కీలకమైన ధరణి అంశంలో ఇద్దరు నేతలు ఇలా బిన్నంగా స్పందించటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో గందరగోళం ఉండగా ఇప్పుడు కొత్తగా ఈ ధరణి గందరగోళం కూడా దానికి యాడ్ అయినట్లు అయింది. నాగర్ కర్నూల్ సభలో నడ్డా ఎప్పటిలాగానే బిఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

బిఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షసుల సమితి అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ లో ధరణి పోర్టల్ కెసిఆర్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జేబులు నింపుతోంది అని.. బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ తో పాటు బిఆర్ఎస్ పోర్టల్ కూడా బంద్ అవుతుంది అన్నారు. పేరు మార్చుకున్నంత మాత్రాన బుద్ది మారదు అంటూ టిఆర్ఎస్ నుంచి బిఆర్ ఎస్ అయినంత మాత్రాన మీ విధానాలు మారలేదు అంటూ మండిపడ్డారు. దేశంలో ఎక్కువ నిత్యావసర ధరలు ఉన్న రాష్త్రం ఏది అయినా ఉంది అంటే అది తెలంగాణలో మాత్రమే అని తెలిపారు . కెసిఆర్ ను అయన కూతురును, కొడుకును, ఇతర కుటుంబ సభ్యులను కాపాడాలి అనుకుంటే బిఆర్ఎస్ కు ఓటు వేయండి..లేదు తెలంగాణ అభివృద్ధి కావాలంటే మాత్రం బీజేపీ కి ఓటు వేయండి అని నడ్డా పిలుపునిచ్చారు. 

Tags:    

Similar News